Sunday, June 21, 2009

నా తొలి టపా

ఎన్నో నాళ్ళ బట్టీ బ్లాగు తెరవాలని ఉత్సాహం ఉండీ, ఎలా చెయ్యాలో తెలీక ఇన్నాళ్ళూ తాత్సారం చేశాను. ఇవ్వాళ్ళ ఈ విషయాలు తెలిసిన ఒక మిత్రుడి రాకతో, కూర్చుని ఈ బ్లాగుకి శ్రీకారం చుడుతున్నా.

మొత్తానికి విజయవాడ ఎండల వేడి తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టినట్టే ఉంది, ఇంక తొలకరి వానలు బాగా పడకపోయినా.
ఇందాక మిత్రులతో భాష, చక్కటి తెలుగు మాట్లాడ్డం రాయడం గురించి ముచ్చటిస్తూ ఉంటే, నా చిన్ననాటి స్నేహితుడు చేసిన ఈ అనువాదం గుర్తొచ్చింది.
The husbandman struck a match and lit his pipe"అనే పాదాన్ని మగడు మనిషి మనువు గొట్టి మురళి వెలిగించే ....అని అనువాదం చేశాట్ట ఒక భాషా ప్రబుద్ధుడు. ఈ తమాషా ఉదాహరణ నేను గంటూరు ఏసీ కాలేజిలో చదువుకునేప్పుడు అక్కడ ఆంగ్లాధ్యాపకులు, యలవర్తి రోశయ్య గారు చెబుతుండేవారు.